స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ నేతల కీలక సమీక్ష సమావేశం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పుతలపట్టు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పార్టీ ఉమ్మడి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో పార్టీ ఘన విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా శ్రమించాలని నేతలు స్పష్టం చేశారు.