పేదరికం ఎరుకతోనే అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానన్న మంత్రి నారాయణ
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పేదరికం ఏమిటో తనకు బాగా తెలుసని, అందుకే నగరాల అభివృద్ధి, పాఠశాలలు, రోడ్లు, పార్కుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టానని మంత్రి పొంగుూరు నారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ వాస్తవాలే తెలియాలని, అందుకే తాను చేసిన పనులను నిత్యం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నానని తెలిపారు. నెల్లూరు ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పట్టణాలను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న మౌలిక వసతుల కల్పన పనులకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.