తీరానికి ముంచుకొస్తున్న అర్నబ్ తుపాను: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

అరబ్ అతితీవ్ర తుపాను తీరంవైపు దూసుకొస్తోందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుపాను బుధవారం ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను ప్రభావంతో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.