స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు సమర్థనీయమే: హైకోర్టులో ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 50.42% ఉందని, క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. 2020 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం సామాజిక, జనాభాపరంగా మార్పులు వచ్చాయని, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగానే ఈ రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించింది.