జిట్టా బాలకృష్ణరెడ్డి వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన నాయకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వలిగొండ
వలిగొండ మండలం వర్కట్పల్లిలో తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలకృష్ణరెడ్డి 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగేల్లి సందీప్గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో బాలకృష్ణరెడ్డి పోరాట పటిమ, ప్రజా సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.