'కూతురైతే మాత్రం ఏది పడితే అది చేస్తానంటే కుదరదు': విజయ్‌సింహరాజే పట్వర్ధన్ హెచ్చరిక

రిపోర్టర్: రాము స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని సాంగ్లీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రఖ్యాత నటి భాగ్యశ్రీ దాసాని స్థానిక గణపతి పంచాయతన్ ఆలయాన్ని సందర్శించి హారతి ఇవ్వడం రాజ కుటుంబంలో తీవ్ర వివాదానికి దారితీసింది. తన తండ్రి విజయ్‌సింహరాజే పట్వర్ధన్ అనారోగ్యంతో ఉండటం వల్లే తాను పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు భాగ్యశ్రీ తెలపగా, ఆమె వాదనను తండ్రి విజయ్‌సింహరాజే తీవ్రంగా ఖండించారు. తన అనుమతి లేకుండా ఆమె ఏ విధంగా హారతి ఇస్తారని ప్రశ్నించిన ఆయన, కూతురైనంత మాత్రాన సంప్రదాయాలను మార్చలేమని స్పష్టం చేశారు. అలాగే తమ రాజవంశ సింహాసనానికి దత్తత తీసుకున్న ఆదిత్యరాజే మాత్రమే ఏకైక వారసుడని విజయ్‌సింహరాజే కుండబద్దలు కొట్టారు.