పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగంలో ఘనంగా క్యాండిల్ ర్యాలీ
రిపోర్టర్: saikumar
స్థలం: సంగం
నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంగం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సంగం గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో ఎస్సై భోజ్యా నాయక్ నాయకత్వంలో సిబ్బంది కొవ్వొత్తులు చేతబూని నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారులను స్మరించుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై స్పష్టం చేశారు.