సంగారెడ్డి జిల్లాలో గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు
రిపోర్టర్: హరి
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని విట్టు నాయక్ తండాలో అభివృద్ధి పనులను ఉన్నతాధికారులు పరిశీలించారని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, డీపీఓ మల్లారెడ్డి తండాలో పర్యటించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యాబోధన తీరును పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలు, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించి స్థానిక అధికారులతో చర్చించారు.