హార్ముజ్ జలసంధిలో అమెరికా ఆధునిక డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అధునాతన MQ-1 డ్రోన్‌ను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్ಡ್స్ కార్ప్స్ కూల్చివేసింది. సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి ఈ డ్రోన్‌ను నేలకూల్చినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలసంధిలో డ్రోన్ కూల్చివేత ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.