దిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ధనబలం ప్రభావంపై కాక్రోజ్ జనతా పార్టీ ఆరోపణలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఛత్రపతి శంభాజీనగర్
దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ధనబలం, ఖరీదైన కార్ల ప్రదర్శన తీవ్ర ప్రభావం చూపాయని కాక్రోజ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. సామాన్య విద్యార్థులు ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని పేర్కొంటూ, వర్సిటీల్లో రాజకీయ జోక్యం, గిరిజన పాఠశాలల దుస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.