ఎన్నికల సంఘంపై నిరసనలకు పిలుపు: అరెస్టుకైనా సిద్ధమన్న అభిజిత్ దిప్కే

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ అక్టోబర్ పదవ తేదీన నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దిప్కే తాను అరెస్టు కావడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశ ప్రజల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరిస్తోందని, రైలు, మెట్రో సేవలను నిలిపివేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.