మరో కొత్త మల్టీప్లెక్స్‌తో బిజినెస్ విస్తరిస్తున్న విజయ్ దేవరకొండ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా థియేటర్ల వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ఏవీడీ సినిమాస్ నిర్వహిస్తుండగా, తాజాగా నార్త్ హైదరాబాద్‌లోని మేడ్చల్ లేదా మల్కాజ్‌గిరి ప్రాంతంలో మరో కొత్త మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇతర అగ్ర హీరోల బాటలోనే ఆయూ ఈ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.