మొక్కల సంరక్షణలో బేకింగ్ సోడా వాడకంపై ఉద్యాన నిపుణుల కీలక హెచ్చరికలు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

ఇంట్ లో పెంచుకునే మొక్కల సంరక్షణ కోసం బేకింగ్ సోడాను ఉపయోగించే సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యాన నిపుణులు స్పష్టం చేశారు. కొన్ని రకాల శిలీంధ్ర సమస్యలను తగ్గించడానికి మాత్రమే ఇది ఉపకరిస్తుందని, అన్ని మొక్కలకు ఇది ఎరువు కాదని వారు తెలిపారు. నేరుగా వేర్ల వద్ద వేయడం వల్ల నేల స్వభావం దెబ్బతింటుందని, మోతాదు మించితే మొక్కల ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.