పరిశ్రమల రసాయన వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారుతున్న చెరువులు
రిపోర్టర్: హరి
స్థలం: తిరుపతి
గూడూరు నియోజకవర్గంలో ఏర్పాటైన వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు స్థానిక జలవనరులను కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హానికర వ్యర్థాలను శుద్ధి చేయకుండా చెరువుల్లోకి వదలడంతో కలుషిత నీరు తాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని, మత్స్యసంపదకు ముప్పు వాటిల్లుతోందని వాపోతున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే స్పందించి ఫ్యాక్టరీలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.