ఖమ్మంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని విజయవంతం చేయాలని పిలుపు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ నర్ల శేషయ్య ముదిరాజ్ తెలిపారు. ఉదయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. ముదిరాజ్ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పెద్దసంఖ్యలో పాల్గొని జయంతిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.