ఆర్థిక లావాదేవీలు ఉన్నవారే పార్టీని వీడుతారన్న బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: శివ స్థలం: విజయనగరం

ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలు ఉన్నవారే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ మారేవారిపై ఘాటు విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వివాదాల నుంచి తప్పించుకోవడానికే కొంతమంది పార్టీని వీడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.