వనపర్తి జిల్లాలో నేర సమీక్ష: అధికారులకు ఎస్పీ డి.సునిత రెడ్డి కీలక సూచనలు

రిపోర్టర్: గోపి స్థలం: వనపర్తి

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డి. సునిత రెడ్డి, ఐపీఎస్ గారు పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారని ఎస్పీ వనపర్తి (SP Wanaparthy) వెల్లడించారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు వేగవంతం చేయడం మరియు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశంలో పోలీసు అధికారులను ఆమె ఆదేశించినట్లు స్పష్టం చేశారు.