'భారీ బ్యాటరీతో ఒప్పో కె14 లైట్': మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్తగా ఒప్పో కె14 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 7,000mAh శక్తివంతమైన బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75-అంగుళాల డిస్‌ప్లేతో ఈ ఫోన్ వస్తోంది. యూనిసాక్ టి7250 చిప్‌సెట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 16,999గా ఉండగా, ఫెదర్ పర్పుల్, స్టోన్ బ్రౌన్ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఈ-స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.