ప్రకృతి ఒడిలో కొలువైన భక్తి ఆధ్యాత్మిక సౌందర్య ధామం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తిరుమలగిరి

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పనిగిరి పచ్చని కొండల నడుమ కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తోంది. గుట్టలపై కనిపించే ప్రాచీన బౌద్ధ క్షేత్ర ఆనవాళ్లు చరిత్రను కళ్లముందు ఆవిష్కరిస్తున్నాయి. ప్రకృతి, భక్తి, చరిత్ర ఒకే చోట కలిసిన అరుదైన ప్రదేశంగా నిలుస్తున్న ఈ ప్రాంతాన్ని స్థానికులు ప్రేమగా రెండో భద్రాద్రిగా పిలుచుకుంటున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.