దుబాయ్ విమానంలో కో పైలట్ దాడిని సాహసోపేతంగా అడ్డుకున్న భారతీయ పైలట్
రిపోర్టర్: విజయ్
స్థలం: Dubai
దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ తనపై కత్తితో దాడి చేసినప్పటికీ తీవ్ర గాయాలతోనే చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని నివారించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు ప్రశంసించారని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో గాయపడిన స్మిత్ మచ్ఛర్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను లోపలకు రప్పించడంతో కో పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.