కుప్పంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు మహిళల పోటీ

రిపోర్టర్: హరి స్థలం: Kuppam

కుప్పంలో జరిగిన బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు మహిళలు భారీగా పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు, యువతతో సీఎం ఆప్యాయంగా ముచ్చటించారు. వారి సమస్యలపై మాట్లాడి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.