వైజాగ్‌లో ఘనంగా గరివిడి లక్ష్మి ప్రీరిలీజ్ ఈవెంట్: ఈనెల 17న విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: విశాఖపట్నం
ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం గరివిడి లక్ష్మి అని మేకర్స్ తెలిపారు. ఆనంది టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.