ఏపీలో పది ప్రాంతాల్లో సీ-ప్లేన్ సర్వీసుల ఏర్పాటుకు వేగంగా అడుగులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీ-ప్లేన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలోని పది కీలక ప్రాంతాల్లో రూ.200 కోట్లతో ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలో టెండర్లు పిలిచి దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.