రష్యా జర్మనీ విదేశాంగ మంత్రుల మధ్య న్యూయార్క్ లో కీలక భేటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూయార్క్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్ న్యూయార్క్లో సమావేశమయ్యారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మంత్రులు ప్రత్యక్షంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భేటీలో నల్లసముద్రం ద్వారా ధాన్యపు ఎగుమతులు, ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై ఇరునేతలు ప్రధానంగా చర్చించినట్లు జర్మనీ ప్రతినిధులు వెల్లడించారు.