AMTZలో డీడీఎం ఇంజనీరింగ్ భూమి పూజ.. మెడ్టెక్ రంగంలో మరో అడుగు

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం ఏఎంటీజెడ్ (AMTZ) క్యాంపస్లో డీడీఎం ఇంజనీరింగ్ సంస్థ నూతన యూనిట్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు బలిరెడ్డి అరవింద్ పాల్గొన్నారు.

మెడ్టెక్ తయారీదారులకు అవసరమైన విడిభాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో అందించడమే లక్ష్యంగా ఈ యూనిట్ పనిచేయనుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంటీజెడ్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక కీలక అడుగు అని కొనియాడారు.