అమెరికాలో ఐసీఈ అధికారి కాల్పులు తీవ్ర కలకలం
రిపోర్టర్: సురేష్
స్థలం: అమెరికా
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ ప్రాంతంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, వెంటనే బాడీ క్యామ్ ఫుటేజీని విడుదల చేయాలని డెమోక్రటిక్ ప్రతినిధి గ్రెగ్ కాసర్ తో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ ఆండర్సన్ లేన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.