రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరాల్లో నూతనంగా నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేసిన ప్రజెంటేషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నగరాల్లో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడానికి, శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులను కమిషనర్లుగా నియమించనున్నారు.