ఏసీబీ దాడుల్లో కీసర సీఐ అక్రమాస్తులు బట్టబయలు: రూ. 2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు
రిపోర్టర్: రాము
స్థలం: Medchal-Malkajgiri
మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ సీఐ ఆర్కపల్లి ఆంజనేయులు అక్రమాస్తుల బాగోతం బట్టబయలైందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం రూ. 2.28 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే లంచం కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులపై తాజాగా ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.