నేలకొండపల్లిలో గణేష్ నిమజ్జనంపై అధికారుల కీలక నిబంధనలు జారీ
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
నేలకొండపల్లిలో వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని, డీజేలను పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. విగ్రహాలను మెయిన్ రోడ్డు మీదుగా ముజ్జుగూడెం చెరువుకు తరలించాలని, తిరుగు ప్రయాణంలో వన్ వే మార్గాన్ని మాత్రమే అనుసరించాలని నిర్వాహకులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.