తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల ఇళ్లు కేటాయించిన కేంద్రం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల ఇళ్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి అదనంగా ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం తరఫున రూ.1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సాయం అందజేస్తామని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.