నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కరువు మండలాలపై మాజీ మంత్రి వినతి
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎల్ నినో ప్రభావం మరియు కరువు మండలాలపై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించినట్లు మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.