ఉద్యమకారుడి ఆత్మహత్య కలచివేసింది: కేసీఆర్ కుటుంబంపై మంత్రి పొంగులేటి ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: జనగామ

తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఉద్యమకారులకు అప్పులు మిగిలితే, కల్వకుంట్ల కుటుంబం మాత్రం వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టిందని ఆయన ఘాటుగా ఆరోపించారు. పదవులు అనుభవించిన ఆ కుటుంబం పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడుతూ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.