రణబాలి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను వచ్చే నెల అక్టోబర్ 8వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్క ఈ భారీ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న నటిస్తుండగా, దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.