కాంగ్రెస్ గూటికి కక్కిరాలపల్లి సర్పంచ్ దంపతులు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ సర్పంచ్ బర్ల వాణి-రవికుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్ గౌడ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు సర్పంచ్ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.