పులివెందుల మున్సిపాలిటీలో ఊహించని సంచలనం: టీడీపీ అభ్యర్థి భారీ ఆధిక్యం

రిపోర్టర్: నరేష్ స్థలం: కడప

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని అధికారులు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై రెండో రౌండ్ ముగిసే సమయానికి ఏకంగా ఆరు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో నిలిచారు. వైఎస్ కుటుంబ కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈ ఫలితం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.