వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: రాజాం

రాజాం శాసనసభ్యులు కోండ్రు మురళీమోహన్ సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తుపాను ధాతికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తామని, సాగునీటి వనరులకు పడిన గండ్లను తక్షణమే పూడ్చివేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.