నెల్లూరు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నాయన్న సింధూర

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నాయని డాక్టర్ పొంగూరు సింధూర మండిపడ్డారు. మంత్రి నారాయణ నేతృత్వంలో నగరంలో కోట్లాది రూపాయలతో సుందరమైన వాతావరణం, రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. బాలాజీ నగర్ డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు.