ఆకుతోటపల్లిలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తుల ధర్నా

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో క్రషర్, మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుల ఆందోళన మూడో రోజుకు చేరింది. జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా లీజులు కేటాయించారని నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.