మర్రిపాడు డీసీపల్లిలో ముగిసిన పొగాకు విక్రయాలు మరియు గిట్టుబాటు ధరపై రైతుల ఆవేదన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో బోర్డు అనుమతి మేర పొగాకు విక్రయాలు శనివారంతో ముగిశాయి. ఈ ఏడాది 125 రోజుల పాటు వేలం జరుగగా, వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి గిట్టుబాటు ధర ఇవ్వలేదని, కనిష్ఠ ధర రూ.110కి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు అనుమతి కోట పోను రైతుల వద్ద ఇంకా సుమారు 5 మిలియన్‌ కిలోల పొగాకు నిల్వ ఉందని, పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి తాము తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.