ఈథా ట్రైలర్ విడుదల: శ్రద్ధాకపూర్ నటనతో భావోద్వేగభరితంగా మహారాష్ట్ర జానపద కళాకారిణి జీవితం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ముంబై

మహారాష్ట్ర జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈథా సినిమా ట్రైలర్ను శుక్రవారం విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె నృత్యాలు, భావోద్వేగ సన్నివేశాలు హైలైట్గా నిలిచాయని, డిసెంబర్ నాలుగో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.