సిగ్మా సినిమాతో సరికొత్త అనుభూతి కలుగుతుందన్న నటి ఫారియా అబ్దుల్లా
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిగ్మా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తాను రేడియో జాకీ పాత్రలో నటించానని, అన్ని రకాల భావోద్వేగాలు ఉన్న ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చని హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తనకు తొలి తమిళ సినిమా కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.