టెక్సాస్లో ఘనంగా శంకర నేత్రాలయ వేడుక: రెండు వేల కంటి శస్త్రచికిత్సలకు నిధులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Texas

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి తెలిపారు. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా గ్రామీణ భారతదేశంలో నివారించగల అంధత్వాన్ని నిర్మూలించే ఈ బృహత్తర లక్ష్యంతో చేపట్టిన ఈ వేడుకలో సుమారు రెండు వేల కంటి శుక్లం శస్త్రచికిత్సలకు అవసరమైన నిధులను సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.