వర్ధన్నపేటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరకులో కొనుగోలు చేసిన ఒక కిలో గంజాయిని ఆటోలో విక్రయించేందుకు తరలిస్తుండగా, వ్యవసాయ మార్కెట్ వద్ద ఎస్ఐ సాయిబాబు బృందం వారిని పట్టుకుంది. నిందితుల నుంచి 50 వేల విలువైన గంజాయి, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రాజు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.