అమెరికాలో సంచలనం: మోసాలకు పాల్పడిన ఫోర్బ్స్ జాబితా ఎంటర్ప్రెన్యూర్ అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: United States

అమెరికాలో ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న టర్కీ దేశానికి చెందిన యువ వ్యాపారవేత్త గోక్సే గువెన్ భారీ మోసాలకు పాల్పడి కటకటాలపాలయ్యారని యూఎస్ అటార్నీ జేమీ మెక్డొనాల్డ్ వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి సుమారు ఏడు మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో పాటు, వీసా పొందేందుకు నకిలీ పత్రాలు సమర్పించారని ఆమెపై అభియోగాలు రుజువు కావడంతో అమెరికా కోర్టు ఇరవై ఐదు నెలల జైలు శిక్ష విధించిందని అధికారులు స్పష్టం చేశారు.