దిల్లీలో ప్రముఖుల ఓట్ల ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేశామన్న అధికారులు
రిపోర్టర్: నరేష్
స్థలం: దిల్లీ
దిల్లీలో ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నోటీసులతో ఎవరి ఓటును తొలగించలేదని, తుది జాబితాలో చేర్చడానికి రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. నవంబర్ 4న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.