హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం భూసేకరణ వేగవంతం
రిపోర్టర్: కిరణ్
స్థలం: రంగారెడ్డి
భాగ్యనగరంలో ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడలో 796.28 ఎకరాల భూసేకరణకు జిల్లా యంత్రాంగం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై, బెంగళూరు, చెన్నై హైస్పీడ్ కారిడార్ల కోసం ఈ ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్ రూపుదిద్దుకోనుంది. విమానాశ్రయం మరియు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండే ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ అంతర్జాతీయ రవాణా కేంద్రంగా మారనుంది.