మహిళా జర్నలిస్ట్ రేఖకు కేటీఆర్ భరోసా: పోలీసుల వేధింపులపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Telangana
మహిళా జర్నలిస్ట్ రేఖను విచారణ పేరుతో పోలీసులు నిర్బంధించి వేధించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆమెకు ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్, గౌతం ప్రసాద్, తుల ఉమ తదితరులు బాధితురాలిని నేరుగా కలిసి మద్దతు తెలిపారు. ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులపై అణచివేత చర్యలు తగవని, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీ నేతలు మండిపడ్డారు.