ఆట స్థలం కోల్పోయిన వైనం: నర్సంపేట మండలం రాజపల్లెలో ఉద్రిక్తత
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మండలం రాజపల్లి గ్రామంలో బతుకమ్మ ఆట స్థలాన్ని అధికారులు పట్టా చేయడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి బతుకమ్మ ఆడే అలుగు ప్రాంతాన్ని పట్టాదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకు వెంటనే ప్రత్యామ్నాయంగా బతుకమ్మ స్థలాన్ని కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.