డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసి పనిచేద్దామని సైబరాబాద్ పోలీసుల పిలుపు

రిపోర్టర్: హరి స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

డ్రగ్స్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలని, లేదంటే ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ ఆనందం పూర్తిగా నాశనమవుతాయని సైబరాబాద్ పోలీస్ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేసింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే స్పందించి 112 నంబర్ కు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతూ వారు ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు.