అమెరికాలో ఏపీ పెట్టుబడుల లైజన్ సతీష్ మండువ సన్మానం: ఉభయ రాష్ట్రాల ప్రగతికి వారధి

రిపోర్టర్: సతీష్ స్థలం: డల్లాస్

అమెరికన్ వ్యాపార సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయడమే తన ముఖ్య బాధ్యత అని నార్త్ అమెరికా ప్రిన్సిపల్ లైజన్ సతీష్ మండువ స్పష్టం చేశారు. డల్లాస్ నగరంలో జరిగిన తన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం, విశాఖ డేటా సెంటర్ హబ్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఏపీలో వేగంగా వస్తున్న పారిశ్రామిక అభివృద్ధిని వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రవాస భారతీయులు అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.